Rishi Prasad- A Spiritual Monthly Publication of Sant Sri Asharam Ji Ashram

సర్వసమర్థులగు గురుదేవుల సంస్కృతి ప్రేమ మరియు పరదుఃఖకాతరత విలక్షణం

‘అలాంటి సర్వాంతర్యామి, కరుణానిధియగు సద్గురువును గురించి ఏమని వర్ణించగలను !’ గత సంచిక తరువాత

గత సంచికలో సుశీల బెహన్ బాపూజీగారు అహమదాబాద్ నుండి దిల్లీ వెళ్ళే సమయంలో యాత్రలో జరిగిన మాటలలో ఏ విధంగా గురుదేవుని అంతర్యామి తత్త్వాన్ని ప్రత్యక్షంగా చవిచూసిందో మీరు చదివారు. ఆమె ఇంకా ఇలా అంటుంది :

మాతృభాష, జాతీయభాష మరియు సంస్కృతి పట్ల మహత్త్వబుద్ధి

గురుదేవులు నా చదువు గురించి అడిగారు. నేను అన్నాను : ‘‘బాపూజీ ! బాల్యంలో నేను కాన్వెంట్ స్కూలులో చదివేదాన్ని.’’

పూజ్యశ్రీ అన్నారు : ‘‘మంచిది ! కాన్వెంటులో ఎలా చదువు చెప్పేవాళ్ళు ?  ఏమేమి చేయించేవారు ?’’

‘‘అక్కడ ఇంగ్లీషు మరియు వాళ్ళ ధర్మానికి చెందిన శిక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపేవాళ్ళు. నేను మూడవ తరగతి చదువుతున్నప్పటి మాట. కాన్వెంటులో హిందువుల పిల్లలకు నైతిక శిక్షణ (Moral Science) మరియు క్రైస్తవుల పిల్లల కొరకు కేటకిజమ్ (Catechism) సబ్జెక్టులుగా ఉండేవి. పిల్లలకు కేటకిజమ్‌ను చదివించడానికై వారిని చర్చికి తీసుకు వెళ్ళేవాళ్ళు, అక్కడ వారికి క్రిష్టియానిటి, బైబిల్, జీసస్ మరియు క్రిష్టియన్ జీవనశైలి గురించి చెప్పేవాళ్ళు. చర్చిలో క్లాసు అయిన తరువాత పిల్లలకు ఎంతో అందమైన వస్తువులను ఇచ్చేవాళ్ళు ఉదాహరణకు జీసస్, మేరీ, జోసెఫ్ మొదలగు వారి వివిధ రకాల ఫోటోలు మరియు విగ్రహాలు, వేరు వేరు రంగులతో కూడి చీకటిలో మెరిసేటటువంటి రోజ్‌మేరీ మాల మొదలైనవి. క్రిష్టియన్ పిల్లలు వీటిని తీసుకుని స్కూలుకు వచ్చినప్పుడు చిన్న చిన్న హిందువుల పిల్లలు ఆ వస్తువులను చూసి ఎంతగానో ఆకర్షితులయ్యేవారు. క్రిష్టియన్ పిల్లలు అనేవారు క్రిష్టియానిటీని ఫాలో అయితే మీకు కూడా ఇవన్నీ లభిస్తాయి.బాల స్వభావం నిజానికి జిజ్ఞాసతో కూడి ఉంటుంది కాబట్టి హిందువుల పిల్లలు పరస్పరం ఇలా చర్చించుకునేవారు : చర్చిలో ఎంతో మంచిగా ఉంటుంది. క్రొత్త క్రొత్త అందమైన వస్తువులు లభిస్తాయి, మనం కూడా క్రిష్టియన్లమైతే ఎంత బాగుండేదో, మనకు ఇవన్నీ లభించేవి.

కాన్వెంటులో ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా ప్రతి వారం అమ్మడానికి 10-10 పైసల 10 బుక్‌లెట్స్‌ను ఇచ్చేవాళ్ళు, వాటిలో జీసస్-మేరీ-జోసెఫ్‌కు చెందిన ఆకర్షణీయమైన ఫోటోలు, చిన్న చిన్న కథలు ముద్రించబడి ఉండేవి. మమ్మల్ని అదే వారంలో ఒక రూపాయిని జమ చెయ్యమని చెప్పేవాళ్ళు.

పూజ్యశ్రీ అన్నారు : ‘‘చూడు, ఎలాంటి వాళ్ళో వీళ్ళు ! మన పిల్లల చేతనే మన సంస్కృతి వేర్లను నరికేయిస్తున్నారు. వాళ్ళ పుస్తకాలను పంచిపెట్టించి వాళ్ళ ప్రచారాన్ని మనచేతనే చేయిస్తున్నారు. మన పిల్లలను ఎలా ఆశకు గురిచేస్తూ ఉన్నారు. మనం కూడా పిల్లలలో మన సంస్కృతి ప్రచార-ప్రసారాల కొరకు ఏదైనా చెయ్యాలి కదా !’’

నేను అన్నాను : ‘‘అవునండి, మనం కూడా ఒక చిన్నపాటి పత్రికను వెలువరించి దానిని పంచిపెడదాం దానితో మన సంస్కృతి ప్రచారం జరుగుతుంది. ఒకసారి బాల్యంలో వాళ్ళతో ప్రభావితురాలినై అజ్ఞానంతో నేను అమ్మతో అన్నాను మనం కూడా క్రిష్టియన్లుగా మారితే మనకు కూడా ఎంతో అందమైన వస్తువులు లభిస్తాయి.’’

అమ్మ అన్నది : ‘‘వద్దు, మనం మన సంస్కారాలను విడిచిపెట్టకూడదు. మన ధర్మం ఎంతో గొప్పది, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉంది.’’

గురుదేవులు అన్నారు : ‘‘చూడు, మీ తల్లి ఎంతో వివేకవంతురాలు కాబట్టి ఆమె నిన్ను కాపాడగలిగింది. నేటి తల్లిదండ్రులు స్వయంగా పాశ్చాత్య కల్చర్ ప్రభావంలో కొట్టుకుపోతూ ఉన్నారు. వారికే తమ సంస్కృతి గురించి తెలియదు. మన పిల్లలకు ఇంగ్లీషు రాకూడదని నేను చెప్పను అయితే వారిలో మన మాతృభాష పట్ల మహత్త్వబుద్ధి ఉండాలి, మన హిందీ భాష కొరకు ఉండాలి.

మన సంస్కృతిలో ప్రపంచానికి మార్గదర్శనం ఇవ్వడానికి ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. వారి వద్ద ఇవ్వడానికి ఏదీ లేదు.

మనం మన సనాతన సంస్కృతికి చెందినటువంటి మంచి మాటలను మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పిల్లలకు ఇద్దాం. మనం వారికి ఆ స్కూళ్ళ కంటే మంచి వాటిని ఇచ్చినప్పుడు మన సంస్కృతి జ్ఞానం వైపు వారు వస్తారు. మనం పిల్లల కొరకు చిన్న చిన్న పుస్తకాలను వెలువరిద్దాం. మనమంతా కలిసి పిల్లలను కాపాడదాం.’’

నేను గమనించాను, ఈ మాటలు చెప్పేటప్పుడు కరుణాసాగరులైన గురుదేవుల హృదయం ఎంతగా బరువెక్కిందంటే గురుదేవుల నేత్ర కమలాలు అశ్రువులతో నిండిపోయాయి. గురుదేవులు ఎంతో గంభీరులయ్యారు. పూజ్య బాపూజీగారి హృదయంలో మన గొప్ప సనాతన ధర్మానికి చెందిన పిల్లలను, మన శ్రేష్ఠతమమగు భారతీయ సంస్కృతికి చెందిన భావి పౌరులను భయంకరమైన కుట్రను పన్ని మన గొప్ప సంస్కృతి నుండి విముఖులను చేస్తూ ఉన్నారు అలాగే ఆ పిల్లలకు తాము తమ సర్వస్వాన్ని కోల్పోతూ ఉన్నామని తెలియనే తెలియదు. ఈ విషయం గురించి పూజ్య బాపూజీ గారి హృదయంలో ఎంతో బాధ కలిగింది.

గురుదేవులు అన్నారు : ‘‘పిల్లలను కాపాడడంలో నువ్వు నాకు సహాయపడతావా ?’’

నేను అన్నాను : ‘‘అవునండి, నేను మీకు సహాయపడతాను.’’

అప్పుడు నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను జవాబును ఇచ్చాను అయితే ఈ రోజు తెలిసి వస్తూ ఉంది వాస్తవం ఏమిటంటే అంతా చేసేది-చేయించేది గురుదేవులే అని. అందరి వెనుక ఉన్న సత్తా, స్ఫూర్తి, సామర్థ్యం అయితే సర్వవ్యాప్తమగు గురుతత్త్వమే. నిజానికి గురుదేవుల దైవిక కార్యంలో లేదా భారతీయ సంస్కృతికి చెందిన సేవలో ఎవరైతే పాలుపంచుకుంటారో వారు భగవదీయ సత్తా యొక్క ప్రేరణతో మరియు శక్తితోనే భాగస్వాములు కాగలుగుతారు. భగవదీయ కార్యాన్ని భగవంతుడే జయప్రదం చేస్తాడు, మీరు-మేము నిమిత్త మాత్రులం, వారి విశ్వ మాంగళ్యకారి లీలకు పాత్రులమవుతాము అలాగే ఆత్మ సంతోషానికి చెందిన నిర్దోష, శుద్ధ సుఖాన్ని పొందుతూ భగవత్‌మయులం అవుతాము.

గురుదేవుల సంకల్పం 5 సంవత్సరాలకు ముందు పూర్తయింది. జనవరి 2016లో పిల్లల కొరకు గురుకుల దర్పణంఅనే పేరుతో ప్రత్యేకమైన పత్రిక మొదలయింది.

జీవితంలో పరదుఃఖకాతరత అనివార్యం

మాట్లాడే సమయంలో నేను పూజ్యశ్రీతో అన్నాను : ‘‘మీరు అనుమతిని ఇస్తే నేను ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను.’’

అనుమతి లభించిన మీదట నేను అన్నాను : ‘‘బాపూజీ ! సమితికి చెందిన ఒక కాకా ఉత్తరాన్ని పంపాడు. దానిలో వ్రాయబడి ఉంది నా కూతురి ఇంట గురుదేవుల కృపతో 3 కూతుళ్ళ తరువాత కొడుకు జన్మించాడు కానీ అతడు పుడుతూనే చనిపోయాడు. గురుదేవుల కృపతో నా కూతురి ప్రాణం నిలిచింది అయితే ఆమె ఎంతో దుఃఖంతో ఉంది.’’

అది వింటూనే బాపూజీగారికి ఎంతో బాధ కలిగింది. పూజ్యశ్రీ కళ్ళు మూసుకున్నారు, తరువాత తెరిచి అన్నారు : ‘‘ఆమెకు చెప్పండి చింతించవద్దని. ఒక సంవత్సరంలో అంతా బాగవుతుంది. అంతకంటే దివ్యమైన ఆత్మను ఇస్తాను. నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు అదేమిటి ?’’

నేను అన్నాను : ‘‘ఇదే మాటను చెప్పాలనుకున్నాను బాపూజీ !’’

పూజ్యశ్రీ ఎంతో ప్రసన్నులై ఇలా అన్నారు : ‘‘మంచిది, నువ్వు నీ గురించి కాదు, ఇతరుల కొరకు అడగాలనుకున్నావు! నేను కోరుకునేది కూడా అదే, అందరూ కేవలం తమ గురించే కాకుండా ఇతరుల కొరకు కూడా శ్రద్ధ చూపాలి, జీవితంలో పరదుఃఖకాతరత ఉండి తీరాలి.’’

వాస్తవానికి ఈ సిద్ధాంతం గురుదేవుల సత్సంగం నుండే నాకు నేర్చుకోవడానికి లభించింది. తాము నేర్పిన పాఠం యొక్క గొప్పతనాన్ని నాకు ఆపాదిస్తూ ఉన్నారు, ఇది గురుదేవుల ఉదారత్వం.

కాకాజీ ఇంట 11 నెలల తరువాత మనవడు జన్మించాడు. వారి కుటుంబం బాబును తీసుకుని అహమదాబాద్‌లో బాపూజీగారి దర్శనానికి వెళ్ళగా గురుదేవులు బాబుకు మోహన్అని పేరు పెట్టి అన్నారు : ‘‘మీరంతా సంతోషమే కదా ?’’

వారన్నారు : ‘‘అవునండి, అంతా సంతోషంగా ఉన్నాం.’’ ఇప్పుడు ఆ బాలునికి 12 సంవత్సరాలు, ఎంతో జిజ్ఞాసువు అలాగే తత్పరతతో ఉంటాడు. బాపూజీగారి పట్ల ప్రత్యేక ప్రేమను చూపుతాడు.

సత్సంగ శ్రవణం మరియు పారాయణం యొక్క సరైన పద్ధతిని నేర్పారు

2006లో నేను దీపావళి పండుగ సందర్భంగా అహమదాబాద్ ఆశ్రమంలో అనుష్ఠానం చెయ్యడానికై రావడం జరిగింది. సుమారు 1.5 సంల దాకా నాకు వాటికలో అనుష్ఠానం చేసే అదృష్టం లభించింది. ఆ సందర్భంలో నాకు గురుదేవుల సత్సంగం-సాన్నిధ్యం, నేరుగా మార్గదర్శనం లభించడంతో ఎంతో నేర్చుకోవడానికి లభించింది.

ఒక రోజున పూజ్య బాపూజీగారు నన్ను అడిగారు : ‘‘నీ అనుష్ఠానంలో దినచర్య ఎలా ఉంటుంది ? రోజువారీ నియమంలో ఏమేమి చేస్తుంటావు ?’’

నేను మొత్తం దినచర్యను చెప్పి అన్నాను : ‘‘నియమంలో ప్రతిరోజూ సత్సంగానికి చెందిన ఒక క్రొత్త కేసెట్‌ను కూడా వింటాను.’’

‘‘ప్రతిరోజూ క్రొత్త కేసెట్‌ను వింటావా !’’

‘‘అవును, బాపూజీ !’’

‘‘రోజూ ఎన్ని క్రొత్త క్రొత్త కేసెట్లు వింటావు అన్నది ముఖ్యం కాదు, కేసెట్‌ను విని ఎంత గ్రహించావు అలాగే జీవితంలో ఎంత పాటించావు అన్నది ముఖ్యం. కొద్దిగా విను ఫర్వాలేదు అయితే దానిని శ్రద్ధతో విని జీవితంలో పాటించేందుకు ప్రయత్నం చెయ్యి. ఒకే కేసెట్‌ను ఒకవేళ నువ్వు మాటిమాటికీ శ్రద్ధతో విన్నావంటే నీకు దాని నుండి నిత్య నవీన జ్ఞానం లభిస్తుంది అలాగే దాని చింతన-మననం చేసిన మీదట జ్ఞానానికి చెందిన మాటలు నీకు అనుభవంలోకి వస్తాయి.’’

పూజ్య బాపూజీగారు సత్‌సంగాన్ని చింతన-మననం చేసి వ్యవహారంలో పాటించాలనే దానిపైన గట్టిగా శ్రద్ధ చూపుతారు. పూజ్యశ్రీ మననం యొక్క మహత్తును చెబుతూ అంటారు : ‘‘ఎన్ని గ్రంథాలు చదివావు, ఎన్నిసార్లు చదివావు అనేది ముఖ్యం కాదు. ఎంతోమంది అంటారు బాపూజీ ! మేము 6 సార్లు యోగవాసిష్ఠాన్ని చదివాము.కానీ వారిని యోగవాసిష్ఠంలో నుండి ఏదైనా అడిగితే వారికి ఒక పంక్తి కూడా గుర్తుండదు ! ఒక ప్యారాగ్రాఫ్‌ను చదువు లేదా 4 వాక్యాలనే చదువు అయితే చదివిన వచనాల చింతన-మననం చేసి వాటిని జీవితంలో పాటించే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ ఒక పంక్తిని కూడా నువ్వు జీవితంలో పాటిస్తే దానిని చదవడం సార్థకమవుతుంది.’’

తరువాత నేను సుమారు 2 నుండి 2.5 నెలల దాకా గురుదేవుల సత్‌సంగానికి చెందిన ఒకే ఒక్క కేసెట్ నిర్భయ నాదాన్నిమాటి మాటికీ విన్నాను అలాగే నాకు ప్రతిరోజూ దానిలో నుండి ఏదో ఒక క్రొత్త మాట అర్థం చేసుకోవడానికి-నేర్చుకోవడానికి లభించేది.