5వ తరగతిలో ఉన్నప్పుడు నా మనసు చదువు పట్ల లగ్నమయ్యేదికాదు, నేనెంతో చిరాకుగా ఉండేవాడిని. దీనివల్ల మా అమ్మ గారు చాలా బాధ పడేది. నేనెంత ప్రయత్నించినా పరీక్షలలో 50-55 శాతం మార్కులే వచ్చేవి. నా తల్లిదండ్రులు పూజ్య బాపూజీ గారి నుండి నాకు మంత్రదీక్షను ఇప్పించారు. పూజ్యశ్రీ గారు జప-ధ్యానాదులు మరియు ఉపాయాలను ఏవైతే తెలియజేశారో వాటిని అభ్యాసించడం వల్ల కొద్ది రోజుల్లోనే నా స్వభావంలో చాలా మార్పు వచ్చింది, మనస్సులో శాంతి కలగడం మొదలయ్యింది. చదువులో కూడా మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యింది. నేను ఎమ్.ఎస్.సి. బయోటెక్నాలజీలో ‘ఎ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడనయ్యాను.
పూజ్య బాపూజీ గారు తులసి గొప్పదనాన్ని సత్సంగాలలో చాలాసార్లు చెబుతూ ఉంటారు. కాబట్టి నేను మహావీర్ క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్ పట్నాలో తులసిపై పరిశోధనను (రీసెర్చ్) ప్రారంభించాను మరియు తులసి ఆకుల నుండి షుగర్(మధుమేహాన్ని) నయం చేసే చికిత్సలో సఫలత పొందాను. నా పరిశోధన ఎంతగానో ప్రశంసించబడింది మరియు ఇంటర్ నేషనల్ జనరల్ ఆఫ్ కరెంట్ మైక్రోబయాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో ప్రచురించడం కూడా జరిగింది. ప్రస్తుతం నేను డయగ్నో ల్యాబ్స్ గుడ్‌గాఁవ్‌లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పదవిని నిర్వర్తిస్తున్నాను. నా ఈ విజయాలన్నీ పూజ్య సంత్ శ్రీ ఆశారామ్‌జీ బాపూ గారికే చెందుతాయి. ఎవరికైతే పూజ్య బాపూజీ గారి నుండి దీక్ష తీసుకునే సౌభాగ్యం లభిస్తుందో వారెంతో ధన్యులు మరియు ఎవరికైతే భవిష్యత్తులో దీక్ష తీసుకునే సౌభాగ్యం లభిస్తుందో వారు కూడా ధన్యులే.
- ఉత్సవ్
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇండియన్ ల్యాబ్స్, గుడ్‌గాఁవ్