Rishi Prasad- A Spiritual Monthly Publication of Sant Sri Asharam Ji Ashram

శ్రీ రామ జన్మభూమి ఉద్యమ ప్రణేత అశోక్ సింఘల్ గారికి రెండు లక్ష్యాలు ఉండేవి ఒకటి సాకారం అయ్యింది, ఇప్పుడు రెండవ దాని వంతు - సంత్ సమాజం

విహెచ్‌పి మాజీ అధ్యక్షులు అశోక్ సింఘల్ గారికి రెండు కలలు ఉండేవి

రామ-మందిర నిర్మాణం మరియు ఆశారామ్ బాపూ గారి విడుదల

ఇది అందరికీ తెలిసిందే, అదేమిటంటే రామజన్మభూమిపైన మందిర నిర్మాణంలో బిజేపి పార్లమెంటు సభ్యులు సుబ్రమణ్యం స్వామితో పాటు విహెచ్‌పి సీనియర్ నాయకులు అశోక్ సింఘల్ గారిది ఎంతో గొప్ప భూమిక ఉంది.  మరి మీకు ఈ విషయం కూడా తెలుసా! ఇద్దరు నాయకులు ఇంకొక విషయంలో కూడా పెద్దపెట్టున పైరవీ చేశారని. అది ఆశారామ్ బాపూ గారి విడుదల. ఇద్దరూ బహిరంగంగా ప్రతి వేదికపైనా అనేవారు ఆశారామ్ బాపూ నిర్దోషులు, వారిని ఇరికించడం జరిగింది అలాగే వారిని వెంటనే సగౌరవంగా విడుదల చెయ్యాలి. అశోక్ సింఘల్ మరియు సుబ్రమణ్యం స్వామి ఇద్దరూ ఆశారామ్ బాపూను కలవడానికి జోధ్‌పూర్ జైలుకు వెళ్ళడం జరిగింది.

ఏమన్నారు సింఘల్ ఆశారామ్ బాపూ గురించి ?

జోధ్‌పూర్ జైలులో బాపూను కలిసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ అశోక్ సింఘల్ చెప్పినదేమిటంటే ‘‘80 యేళ్ళ వయస్సులో ఆశారామ్‌జీ బాపూగారిని తప్పుడు పద్ధతిలో ఇరికించి వేధిస్తూ ఉన్నారు. చట్టంలో ఎవరినైనా ఇరికించవచ్చు. బాపూకు బెయిల్ లభించాల్సిందే. ఈ ఆరోపణ, కేసు - అంతా తయారుచేయబడిందే. 80 యేళ్ళ వయస్సులో బాపూ గారిని ఎన్నో కష్టాలకు గురిచెయ్యడం జరిగింది, ఈ విధంగా వారికి అలాగే వారిపేరుతో హిందూ సంత్‌లకు మరియు హిందు సమాజం తలపైన గొడ్డలి వేటు వెయ్యడం జరిగింది. హిందు ధర్మానికి వ్యతిరేకంగా దేశం లోపల వాతావరణం ఏర్పడేందుకై పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తారు విదేశీయులు. వారికి తెలియనే తెలీదు మన వేర్లు ఎక్కడ ఉన్నాయో. వారు స్వయంగా నశిస్తారు కానీ మనల్ని ఏమీ చెయ్యలేరు.

ఆశారామ్‌జీ బాపూగారు నేడు ఎంతో పేరుగాంచిన సంత్‌లు, వారు నేడు మన హిందు సంస్కృతి మరియు గుర్తింపులను సమాజంలో ప్రతిష్ఠితం చెయ్యడంలో నిమగ్నమై ఉన్నారు. వారు గిరిజన, వనవాసీ సమాజానికి చెందిన వారిని కూడా మన సంస్కృతి పట్ల నిష్ఠావంతులనుగా చేసే ఏ గొప్ప కార్యాన్ని చేశారో, దానికై మొత్తం హిందు సమాజం వారికి ఋణపడి ఉంటుది అలాగే ఎన్నడూ ఆ ఋణాన్ని తీర్చుకోలేదు. అలాంటి గొప్ప సంత్‌లు అనేక రకాల సేవా కార్యాలను వనవాసీ ప్రాంతాలలో నెలకొల్పారు, అది ఎవరికైతే సహించరానిదయ్యిందో వారే మీడియా మాధ్యమంతో మహరాజ్ గారిని ఎలాగైతే శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతీ గారిని అప్రతిష్ట పాలు చెయ్యడం జరిగిందో అలా చెయ్యాలనుకున్నారు.’’

ఏమి చెబుతూ వచ్చారు సుబ్రమణ్యం స్వామి

డా. సుబ్రమణ్యం స్వామి దీనిని ముందుగానే చెప్పడం జరిగింది ‘‘అమ్మాయి ఫోన్ రికార్డులతో తెలిసినదేమిటంటే ఏ సమయంలో ఆమె కుటీరంలో ఉన్నట్లుగా చెబుతుందో, ఆ సమయంలో ఆమె అక్కడ లేనేలేదు ! అదే సమయంలో బాపూ సత్సంగంలో ఉన్నారు అలాగే చివరలో ఒక నిశ్చితార్థ కార్యక్రమంలో తీరిక లేకుండా ఉన్నారు. వారు కూడా అక్కడ కుటీరంలో లేరు. బాపూపైన పాక్సో యాక్ట్మోపడానికై ఒక అబద్ధపు సర్టిఫికెట్‌ను తీసి చూపించడం జరిగింది అమ్మాయి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుకు చెందినదని. హిందు-వ్యతిరేక మరియు జాతి-వ్యతిరేక శక్తుల నిగూఢమైన కుట్రలను మరియు హిందు సంత్‌లను అప్రతిష్టపాలు చేసే వారి అప్రత్యక్ష కీలు బొమ్మలను నేరుగా మరియు అమాయకులైన హిందువులు చూడలేకపోతున్నారు. సంత్ ఆశారామ్‌జీ బాపూగారికి వ్యతిరేకంగా మోపబడిన కేసు పూర్తిగా బోగస్.’’

అయోధ్యలో శిలాన్యాస సందర్భంగా సంత్‌లు గుర్తు చేసుకున్నారు

భారతీయ జనక్రాంతి దళ్, అయోధ్య ప్రదేశ్ అధ్యక్షులు డా. శ్రీ రాకేశ్ శరణ్‌జీ మహారాజ్ అశోక్ సింఘల్‌గారి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పినది అందరికీ తెలిసిందే ‘‘శ్రీరామ జన్మభూమి ఉద్యమ ప్రణేత అశోక్ సింఘల్‌జీ గారికి రెండు లక్ష్యాలు ఉండేవి. ఒకటి శ్రీరామ జన్మభూమిపైన భవ్య మందిర నిర్మాణం జరగాలి అలాగే రెండవది మతమార్పిడులకు బద్ధ వ్యతిరేకి, బాల బాలికలలో రాముని ప్రకాశాన్ని మేల్కొల్పే మన పూజ్య సంత్ ఆశారామ్ బాపూ, ఎవరైతే నిర్దోషులో, వారిని జైలు నుండి విడుదల చేయించాలి. ఒక లక్ష్యమైతే పూర్తవుతూ ఉంది కానీ రెండవ లక్ష్యం ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుందో ?’’

మహారాజ్ గారు ఆశారామ్‌జీ బాపూగారిని గొప్ప సంత్‌లుగా పేర్కొన్నారు అలాగే ఇంకా చెప్పినదేమిటంటే హిందు సమాజానికి వారు చేసిన సహాయానికి వారు శిలాన్యాస కార్యక్రమంలో ఉండాల్సింది. ‘‘హిందు ధర్మ రక్షణకై ఎవరైతే సంఘర్షణ చేశారో, మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేశారో, అలాంటి మహోన్నత సంత్ ఈ కార్యక్రమం (శ్రీరామ మందిర శిలాన్యాస కార్యక్రమం)లో ఉండాల్సింది కానీ వారు ఈనాడు జైలులో ఉన్నారు.’’

అయోధ్య సంత్ సమితి మహామంత్రి మహంత్ పవనకుమార్ దాస్ శాస్త్రీజీ గట్టిగా చెప్పినదేమిటంటే ‘‘సంత్ ఆశారామ్‌జీ బాపూగారిపైన ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుండి పూర్తి విశ్వాసంతో చెబుతూ ఉన్నాను ఈ కళంక, ఆరోపణ అబద్దం మరియు ఇష్టారీతిగా చెయ్యబడినది. దీనిని పన్నాగంతో తయారు చెయ్యడం జరిగింది అలాగే ఎక్కడికి తీసుకువెళ్ళారంటే అక్కడ నియమాలు మరియు చట్టాల వల్ల కొన్ని మాటలను మాట్లాడలేము. బాపూజీగారు వ్యాసపీఠాన్ని శోభితం చేసి సమాజాన్ని జాగృతం చేసే కార్యాలను చేస్తూ ఉండేవారు. బాపూజీగారిని మరియు ఇతరులను కళంకితం చేసే ఏ యత్నాలైతే ఉన్నాయో, అవి ఈ దేశానికి మేలు చెయ్యవు. శాసనం, విధి, అధికారం రంగంలో ఎవరైతే కూర్చుని ఉన్నారో వారు గంభీరంగా ఆలోచించవలసి ఉంది. జరిగిందేదో జరిగింది అయితే దాని ప్రాయశ్చిత్తం ఏమిటంటే శ్రీరామ జన్మభూమి వలె సంత్-మహాత్ముల విముక్తీకరణ జరిగి తీరాలి.

రామ మందిర శిలాన్యాస సందర్భంగా అయోధ్యలో హాజరైన ఇంకా ఎందరో సంత్‌లు - మహంత్‌లు అశోక్ సింఘల్‌జీ గారిని గుర్తు చేసుకున్నారు అలాగే వారి సంకల్పంతో ఏకీభవించారు.

సంత్ ప్రకోష్ఠ మహారాష్ర్ట ప్రదేశ్, జాతీయ సంత్ సురక్షా పరిషత్తుకు చెందిన సంపూర్ణ దక్షిణ భారత ప్రభారి మరియు మహామంత్రి డా. శ్రీకృష్ణ పురీజీ మహారాజ్ చెప్పినదేమిటంటే ‘‘సంత్ ఆశారామ్ బాపూపైన ఈ అన్యాయం రాజకీయంలో ఒక అంతర్భాగం. ఇంత గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించిన సంత్ ఇంత హేయమైన పనిని చెయ్యలేరు. ఏ దేశాన్ని హిందు పేరున గుర్తించడం జరుగుతుందో ఆ దేశంలో హిందు సంత్ పట్ల అన్యాయం జరగడం అనేది ఎంతో తప్పిదమైన విషయం.

కటరా కుటీ ధామ్, అయోధ్యకు చెందిన మహంత్ చిన్మయదాస్‌జీ మహారాజ్ కూడా చెప్పినదేమిటంటే ‘‘ఆశారామ్‌జీ బాపూగారు నిస్సందేహంగా ఎంతో మహోన్నతులైన సంత్‌లు. ఒకవేళ వారిలో ఏదైనా ప్రత్యేకత లేకపోతే ఈనాడు కోట్లాదిమంది భక్తులు వారితోపాటు నిమగ్నమై ఉండేవారు కాదు. నేను గట్టిగా చెప్పగలను లోక-కల్యాణం కొరకే ఆశారామ్‌జీ బాపూగారు ఇంత పెద్ద కళంకాన్ని తలపై మోస్తూ ఉన్నారు. బాపూగారు కళంకాన్ని తలకెత్తుకోవడం సముచితంగా భావించారు కానీ ఎన్నడూ బేర-సారాలు చెయ్యలేదు. నేను ఆశారామ్‌జీ బాపూగారికి కోటి-కోటి నమస్కారాలు చేస్తున్నాను. సనాతన సంస్కృతి రక్షణ కొరకు ఎంతమంది సంత్‌లు నేటిదాకా వచ్చారో, వారు సంత్ కబీర్‌దాసు కావచ్చు, గురు నానక్‌జీ కావచ్చు, స్వామీ వివేకానందుడు కావచ్చు లేదా స్వామీ దయానందుడు కావచ్చు... అన్యాయం జరగనటువంటి సంత్‌లు ఎవరూ లేరు. ఏ ఏ సంత్‌ల పట్ల అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరగాలి. ఒకవేళ అలాంటి సంత్‌లు లేకపోతే తప్పకుండా ఈ దేశం మరియు సంస్కృతి కూడా మిగిలి ఉండవు.’’