Rishi Prasad- A Spiritual Monthly Publication of Sant Sri Asharam Ji Ashram

అజ్ఞానుల జీవితం వృథాగా గడిచిపోతూ ఉంది

‘శ్రీ యోగ వాశిష్ట మహారామాయణం’లో వశిష్ఠుల వారు ఇట్లన్నారు : "ఓ రామా !  మన యొక్క వాస్తవిక స్వరూపం బ్రహ్మయే. బ్రహ్మను నిర్లక్ష్యం చేయడం వల్ల జీవుడు మోహాన్ని (అజ్ఞానాన్ని)  పొందుతూ ఉంటాడు.  కమ్మరి తోలుతిత్తి వృధాగా గాలిని పీల్చుకొంటుంది అలాగే ఈ  జీవుని చేష్ట వ్యర్థమైనదై ఉంటుంది.

 

పూజ్య బాపూజీ : ఎలాగైతే కమ్మరి తోలుతిత్తి వృధా గాలిని పీల్చుకుంటూ ఉంటుందో అలాగే  అజ్ఞానుల యొక్క జీవితం వృథాగా గడిచిపోతూ ఉంటుంది.  ఏదైతే సత్ చిత్ ఆనంద స్వరూపం యొక్క వైభవం ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో సుఖం ఉంటుందో వాటిని పొందలేరు అలాగే, పెనుగులాటలో ‘నీ - నా’ అనుకుంటూ చేస్తూ - చేయిస్తూ కూడబెట్టుకుని, అంతా విడిచిపెట్టి చనిపోతారు. దేనినైతే తీసుకొని పోయేది లేదో దానిని కూడబెట్టి దాచుకుంటూ ఉన్నారు. ఏదైతే మొదట్లో ఉండేది కాదో, తర్వాత ఉండదో దాని కొరకే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదైతే మొదట్లో ఉండేదో ఇప్పుడు కూడా ఉందో తర్వాత కూడా ఉంటుందో దాని వైపు వెళ్ళడానికి గుడ్డివారవుతూ ఉన్నారు.

శ్రీ వశిష్ఠులవారు ఇలా అంటారు : "అలాంటి వాళ్ల చేష్టలు, మాటలు  అనర్ధాన్నే కలిగించేవిగా ఉంటాయి. ఎలాగైతే ధనుస్సు నుండి వెలువడే బాణం కేవలం హింసించడానికే. దానివల్ల  మరొక  పని ఏదీ జరగదో, అలాగే అజ్ఞాని యొక్క చేష్టలు మాటలు అనర్ధాన్ని మరియు దుఃఖాన్ని కలిగించడానికే ఉంటాయి. అంతేగానీ సుఖాన్ని కలిగించడానికి కాదు, వాళ్ళ సహవాసం కూడా శ్రేయస్సును కలిగించేదిగా ఉండదు. ఉదాహరణకు అడవిలో మోడుబారిన చెట్టు నుండి నీడను గానీ  పండ్లను గాని ఆశించడం వ్యర్థమే. దానికి ఏ పండ్లు కాయవు విశ్రాంతి పొందడం కోసం ఎటువంటి నీడ కూడా ఉండదు. అలాగే అజ్ఞానులగు జీవుల స్నేహం వల్ల సుఖం లభించదు. అటువంటి వ్యక్తికి దానమివ్వడం వ్యర్థమే. ఎలాగైతే బురదలో పోసిన  నెయ్యి వ్యర్థమవుతుందో అలాగే మూర్ఖులకు ఇవ్వబడిన దానం వ్యర్థమవుతుంది. అలాంటి వ్యక్తి తో మాట్లాడటం కూడా వ్యర్థమే.

పూజ్య బాపూజీ :  ఎవరికైతే ఆత్మజ్ఞానంపై అభిరుచి  ఉండదో  అటువంటి మూర్ఖులకు అజ్ఞానులకు దానమివ్వడం కూడా వ్యర్థమే.  అజ్ఞానితో సహవాసం చేయడం కూడా వ్యర్థమే. ఎలాగైతే ఒంటె ముళ్ళ చెట్టు వద్దకే వెళుతుందో అలాగే అజ్ఞాని వద్దకు చేరితే అజ్ఞానమే పెరుగుతుంది. ఎవరైతే భగవత్ స్వరూపంలో, తన శాశ్వత స్వరూపంలో నిమగ్నమై ఉంటాడో అతడే నిజమైన జ్ఞాని. దేనిని చూసి, ఆఘ్రాణించి (వాసన చూసి), రుచి చూసి మజా  చెయ్యాలనుకునే వాడు అజ్ఞాని.  ఏవైతే మనవి కావో, మన వెంట ఉండవో, అవియే భోగాలు (విషయ సుఖాలు).  ఎవరైతే మన వాడో, ఎప్పటికీ తోడుగా ఉంటాడో అతడినే భగవంతుడు అంటారు, ఏదైతే అశాశ్వతమైనదో సంపూర్ణమైనది కాదో, దుఃఖమయమగు, అశాంతమయమగు అంతమగు పనుల వల్ల, కోరుకొంటే లభిస్తూ ఉంటుందో, ఏదైతే చాలా శ్రమిస్తే లభిస్తుందో, లభించిన తరువాత కూడా నిలబడదో అదే లోకం. దానినే జగత్తు అని అంటారు.ఏదైతే శాశ్వతమైనదో, సంపూర్ణమైనదో, సుఖ స్వరూపమైనదో, శాంతి స్వరూపమో, దేనిని పొందడంలో శ్రమ పడవలసిన అవసరముండదో, చాతుర్యం,అతి తెలివి, కపటం (మోసం) అవసరముండవో సహజంగానే లభిస్తుందో, కేవలం నిజాయితీ మరియు ప్రీతి ఉంటే చాలు, మరి ఏ ప్రయాస వల్ల కూడా లభించదో, ఏదైతే సునాయాసంగా, సహజంగా, ఏర్పడ్డ ఎల్లప్పటికీ లభించి ఉంటుందో, ఎన్నటికీ నశించదో దానినే ‘జగదీశ్వరుడు’ (పరమాత్మ) అంటారు. అజ్ఞానులైన వాళ్ళు మాత్రం దుఃఖమయమగు  చేష్టలను చేస్తూ, ఏదైతే నిలబడదో, దాని కోసమే మరణిస్తూ ఉంటారు. జ్ఞానవంతుడు మాత్రం ఏదైతే అంతంకాదో దాని యొక్క శాంతి మాధుర్యాలలో పరవశించి ఉంటాడు. పరమాత్మ యొక్క ప్రీతి, శాంతి మరియు పరమాత్మ యొక్క జ్ఞానం  సకల దుఃఖాలను హరింపజేస్తుంది. పరమాత్మను పొందిన మహాపురుషులను చూసినట్లయితే శాంతి లభిస్తుంది.